
నిజామాబాద్
న్యూస్‌రీల్
‘సాక్షి’ గొంతు నొక్కేందుకు కుట్రలు
వాతావరణం
ఆకాశం మేఘావృతమవుతుంది. చల్లనిగాలులు వీస్తాయి. మబ్బులతో కూడిన ఎండ ఉంటుంది.
ఇళ్ల నిర్మాణాలను..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
– IIలో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు ట్రలు చేస్తోంది. ఈ అన్యాయాలను, కుట్రలను అ న్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. సా మాజిక రుగ్మతలపై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పాటుపడుతున్న ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి మీద వరుసగా కేసులు పెడు తుండడంతోపాటు విచారణల పేరిట వేధింపుల కు గురిచేయడం పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ప లువురు ప్రజాసంఘాల నాయకులు ‘సాక్షి’పై చే స్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నిజామాబాద్ నగరపాలక సంస్థ కూడలిలో నిరసన కార్యక్రమం జరుగనుంది. జర్నలిస్టు, రా జకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొననున్నాయి.
సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం సరికాదు. వాస్తవాలు ప్రజలకు చేరవేసే సాక్షి వంటి ప్రజా పత్రికా విలేఖరులపై అక్రమ కేసులు బనాయించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతోంది. ఏపీ ప్రభుత్వ చర్యలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో దాడులు, భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్యలు.
– ఓమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి
పత్రికలు ప్రజాసమస్యలు వెలికితీసి పరి ష్కారానికి కృషి చేస్తాయి. ప్రజా సమస్యలను సాక్షి పత్రిక బయటపెడుతుంటే ఏపీలోని కూటమి ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా పత్రికలు ప్రజాపక్షం వహిస్తే అ క్రమ కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్రలను ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సాక్షిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి.
– ముస్కె సుధాకర్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్య పరుస్తున్న పత్రికలపై ప్రభుత్వాలు కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పత్రికా స్వేచ్ఛను హరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తకాదు. సాక్షి పత్రికపై, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. కేసులు ఉపసంహరించునేవరకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.
– వి.ప్రభాకర్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథ
రాష్ట్ర నాయకుడు
పత్రికలపై కేసులు పెట్టి భయభ్రాంతుల కు గురి చేయడం సరికాదు. సాక్షి పత్రికపై పదే పదే నకిలీ కేసులు పెట్టి వే ధించడాన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తే సంజాయిషీ అడగవచ్చు, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్ర యించవచ్చు తప్ప తప్పుడు కేసులు పెట్టి వేధించడం సరికా దు. నిరంకుశత్వంతో అణగదొక్కుతామంటే ప్రజలు చూ స్తూ ఊరుకోరు. ప్రజల నుంచి తీవ్ర నిరసనను పాలకులు ఎదుర్కోక తప్పదు. – రమేశ్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్