
లిక్కర్‌కు మహా కిక్కు
గడువు ముగిసేలోగా భారీగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : 2025–27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన గడువు శనివారంతో ముగియనుంది. లాటరీ పద్ధతిలో కేటాయించే దుకాణాల టెండర్లకు ఎకై ్సజ్ శాఖ గత నెల 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాలు ఉండగా, కామారెడ్డి జిల్లాలో మొత్తం 49 దుకాణాలు ఉన్నాయి. వీటికి 2023–25 సంవత్సరాలకు సంబంధించి 5,963 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలోని దుకాణాల కోసం 3,759 దరఖాస్తులు, కామారెడ్డి దుకాణాలకు సంబంధించి 2,204 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తుల్లో 95 శాతం చివరి రెండు రోజుల్లోనే వచ్చాయి. అందువల్ల గతంలో మాదిరిగానే ఈసారి కూడా చివరి రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 1,106 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిజామాబాద్ జిల్లా దుకాణాల కోసం 687 దరఖాస్తులు, కామారెడ్డి దుకాణాల కో సం 419 దరఖాస్తులు వచ్చాయి. అయితే 1,106 ద రఖాస్తుల్లో 422 దరఖాస్తులు గు రువారం ఒక్కరోజు వచ్చినవే కావడం గమనార్హం. దీన్నిబట్టి చివరి రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు రానున్నట్లు అంచనా.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా చివరి రెండు రోజుల్లో దరఖాస్తులు వెల్లువెత్తనున్నాయి. ఇందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈనెల 18న అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. బోధన్, బిచ్కుంద దుకాణాలకు సంబంధించి మహారాష్ట్ర వారి నుంచి దరఖాస్తులు మరింతగా వస్తాయని భావిస్తున్నాం.
– సోమిరెడ్డి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్
బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లోని వైన్స్‌లపై మహారాష్ట్ర వ్యాపారుల ఆసక్తి
తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రంలో మద్యం ధర ఎక్కువ ఉండటమే కారణం
నేడు, రేపు మద్యం దుకాణాల కోసం
టెండర్ల జాతర !

లిక్కర్‌కు మహా కిక్కు