
అభిప్రాయ సేకరణ.. ఆసక్తికరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పార్టీ నాయకత్వం చేపట్టిన వడపోత కార్యక్రమం జిల్లాలో రోజురోజుకూ ఆసక్తిని మరింతగా పెంచుతోంది. పైగా పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ సీటును బీసీకి అప్పగిస్తారా.. ఓసీకి కేటాయిస్తారా అనే విషయంలో కచ్చితమైన నిర్ణయానికి రాకపోయినప్పటికీ ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రతి అంశాన్ని కూలంకశంగా పరిశీలిస్తున్నారు. ఈ పీఠం కోసం పోటీలో ఉన్నవారితో ఇప్పటికే ఈ నెల 14న ఒకసారి ముఖాముఖి నిర్వహించారు. తాజాగా గురువారం మరోసారి ముగ్గురితో ముఖాముఖి నిర్వహించారు. బాడ్సి శేఖర్‌గౌడ్, మార చంద్రమోహన్‌రెడ్డి, బాస వేణుగోపాల్‌యాదవ్‌లతో పరిశీలకుడు రిజ్వాన్ అర్షద్ ముఖాముఖి మాట్లాడారు. శుక్రవారం కాటిపల్లి నగేష్‌రెడ్డితో ముఖాముఖి నిర్వహించనున్నారు. పరిశీలకుడు ఆయా నియోజకవర్గాల వారీగా అందులో బ్లాకులవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులతో మాట్లాడి మొదటి, రెండో ప్రాధాన్యత అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
డీసీసీ ఎన్నికపై నియోజకవర్గాలవారీగా సమావేశాలు
ఇప్పటికే బోధన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్‌లలో పూర్తి
నేడు నిజామాబాద్ రూరల్‌లో,
రేపు బాన్సువాడలో..
నియోజకవర్గాల్లో మారుతున్న సీనియర్ల ప్రాధాన్యతలు

అభిప్రాయ సేకరణ.. ఆసక్తికరం

అభిప్రాయ సేకరణ.. ఆసక్తికరం

అభిప్రాయ సేకరణ.. ఆసక్తికరం

అభిప్రాయ సేకరణ.. ఆసక్తికరం