సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: యోగా చేయడాన్ని మొదట వ్యతిరేకించినవారే, ఇప్పుడు అవగాహనతో చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో 2000 సంవత్సరంలో ‘యోగా రత్న’ ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో మొదలైన ‘మైనారిటీ యోగా కేంద్రం’ ప్రత్యేకంగా నిలుస్తోంది. 25 సంవత్సరాల కిత్రం అర్సపల్లి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ మైనారిటీ యోగా కేంద్రాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం దీన్ని నాలెడ్జ్ పార్క్ స్కూల్‌లో నిర్వహిస్తున్నా రు. ప్రతిరోజూ యోగా చేస్తుండడంతో తామంతా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి చాలావరకు స్వాంతన పొందుతున్నట్లు సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు. మొదట్లో ముస్లిం మైనారిటీ సమాజంలోని కొందరి నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ తర్వాత అవగాహన వచ్చి కేంద్రాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. అయితే యోగాసనాలు వేసే సమయంలో ఓంకారానికి బదులు అల్లాహ్ అని ఉచ్చారణ చేస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే ఈ కేంద్రంలో యోగా చేస్తున్నవారిలో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత తదితర పురాణాల గురించి అనర్గళంగా చెప్పేవారుండడం.
యోగాసనం.. అల్లాహ్ ఉచ్చారణ
యోగాసనం.. అల్లాహ్ ఉచ్చారణ