
హైవే పైనా ఆరబోత
● పంట దిగుబడులను పోస్తున్న రైతులు
● కల్లాలు లేకపోవడంతో తప్పని పరిస్థితి
బాల్కొండ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటల దిగుబడులకు అకాల వర్షాలు వెంటాడుతుండటంతో అన్నదాతలు హైవే పై కూడ ఆరబెడుతున్నా రు. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ నుంచి మెండోరా మండలం దూదిగాం వరకు గల జాతీయ ర హదారి 44 పై రైతులు మక్కలను ఆరబెట్టారు. దీంతో ఎవుసం హైవే ఎక్కుతుందని అన్నదాతలే ఆవేదన చెందుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారి నా రైతులకు సీసీ కల్లాలను అందించడంలో వి ఫ లం చెందుతున్నాయి. దీంతో రైతులు తారు రోడ్లనే కల్లాలు చేసుకుని మక్కలను ఆరబెడుతున్నా రు. గత కొంత కాలంగా వర్షాలు నిరంతరం కురవడంతో అన్నదాతలు పండించిన పంట నీటి పాలైంది. ప్రస్తుతం తుపాన్ హెచ్చరిక ఉండటంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరు గెడుతున్నాయి. దీంతో అధికంగా మక్కలను నూర్పిళ్లు చేసి రోడ్లపై ఆరబెట్టారు. జాతీయ రహదారి పై వాహనాలు అతివేగంగా వెళ్తాయి. అలాంటి సందర్భంలో రైతులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది.
ప్రభుత్వాలు సబ్సిడీపై సిమెంట్ కల్లాలను మంజూ రు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని రైతులు అంటున్నారు. ఉపాఽధి హామీ పథకంలో గతంలో సిమెంట్ కల్లాలను మంజూరు చేశారు. అయితే నిబంధన ల ప్రకారం కొలతలు చిన్నగా ఉండటంతో రైతులు ఆసక్తి చూపలేదు. రైతులకు అనుగుణంగా కొలతలు ఉంటే ఆసక్తి చూపేవారమంటున్నారు. ప్రభు త్వం స్పందించి సిమెంట్ కల్లాలను నిర్మించాలని రైతులు కోరుతున్నారు. తారు రోడ్లపై మక్కల సీజన్ నుంచి యాసంగిలో వరి ధాన్యం పంట దిగుబడులు ఆరబెట్టే వరకు అంటే మే నెల వరకు తారు రోడ్లు పంట దిగుబడులతో నిండిపోతుంటాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వెంటనే సిమెంట్ కల్లాలు మంజూరు చేయాలని రైతు లు వేడుకుంటున్నారు.
కల్లాలులేకనే రోడ్లపై ఆరబెడుతున్నాం
అనుకూలంగా కల్లాలు లేక పోవడం వలనే హైవే రోడ్డుపై పంట దిగుబడులను ఆరబెడుతున్నాం. వాతావరణం కూడ రైతులను సతాయిస్తుంది. ప్రభుత్వాలు స్పందించి సిమెంట్ కళ్లాల మంజూరు చేయాలి. – శ్రీనివాస్, రైతు, శ్రీరాంపూర్