రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ | - | Sakshi
Sakshi News home page

రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ

Oct 5 2025 2:32 AM | Updated on Oct 5 2025 2:32 AM

రూ.92

రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ

మాక్లూర్‌: మండలంలోని ముల్లంగి (బి) గ్రా మంలో దుర్గామాత వద్ద ఉంచిన గుమ్మడి కాయను శనివారం నిర్వాహకులు వేలం వేశా రు. అదే గ్రామానికి చెందిన బూరోల్ల ధర్మపతి వేలంలో గుమ్మడికాయను రూ.92 వేలకు దక్కించుకున్నాడు. దుర్గామాత మండప నిర్వాహకులు ఽభక్తుల సమక్షంలో గుమ్మడికాయను ధర్మపతికి అందజేశారు.

ధాన్యం దళారులకు అమ్మి నష్టపోవద్దు

వర్ని : రైతులు కష్టపడి పండించిన ధాన్యా న్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ సూచించా రు. శనివారం వర్ని మండలంలోని పాత వర్ని సహకార సంఘంలో వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించా రు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం వల్ల గిట్టుబాటు ధర ఏ గ్రేడ్‌ రకానికి రూ. 2,389, బి గ్రేడ్‌ రకానికి రూ.2,369 చెల్లించడంతోపాటు సన్న రకాలకు రూ. 500 బోనస్‌ కూడా వస్తుందని సహకార అధికారి పేర్కొన్నారు. దళారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. తహసీల్దార్‌ సాయిలు, సొసైటీ చైర్మన్‌ సాయిబాబా పాల్గొన్నారు.

సమన్వయంతో పరిష్కరించాలి

వర్ని: మండలంలోని సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద వివాదాస్పదంలో ఉన్న భూమిని బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో శనివా రం పరిశీలించారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న స్థలాన్ని పరిశీలించి, సమన్వయంతో రెండుశాఖల అధికారులు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యను 15 రోజుల్లో పరి ష్కరించాలని లేకపోతే రిజర్వాయర్‌ పనులు ఆలస్యం అయ్యే ప్రమాదముందన్నారు.

వరద గేట్ల ముందు జాలరి గల్లంతు

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ వరద గేట్ల ముందర గోదావరిలో చేపలు వేటాడుతున్న మత్స్యకారుడు శనివారం గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై సుహాసిని, స్థానిక మత్స్య కారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కాల్వా గ్రా మానికి చెందిన లింబోజి అనిల్‌ (25), లింబోజి ఆనంద్‌ అన్నదమ్ములు ఇద్దరు మధ్యా హ్నం నుంచి గోదావరిలో వరద గేట్ల ముందర చేపలు వేటాడుతున్నారు. ఈ క్రమంలో వరద గేట్ల ముందర ప్రవాహానికి ఎదురెళ్లడంతో తెప్ప తలకిందులు అయ్యింది. అనిల్‌ నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాడు. ఆనంద్‌ ప్రవాహం పక్కన ఉన్న బండరాయిని పట్టుకుని బతికి పోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒక తెప్ప పై ఇద్దరు వేటకు వెళ్లాల్సి ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. గోదావరిలోనే చేపలు వేటాడుతున్న మత్స్యకారులు గమనించి వెంటనే ప్రాజెక్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. ప్రాజెక్ట్‌ అధికారులు వెంటనే వరద గేట్లను మూసివేశారు. అనంతరం స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే వరకు ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలను నిలిపి వేశారు. అనంతరం మళ్లీ రాత్రి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్‌ అధికారులు ప్రారంభించారు.

రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ 1
1/2

రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ

రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ 2
2/2

రూ.92 వేలు పలికిన గుమ్మడికాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement