
దేవీ మాతకు ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్ రూరల్: నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దుర్గా మాత విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనోత్సవాలు
నగరంలో ఘనంగా జరిగాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఉత్సవాలు రాత్రి వరకు కొనసాగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు మంగళహారతులతో అమ్మవారికి వీడ్కోలు పలికారు. పిల్లలు, మహిళల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మార్కండేయ మందిరం వద్ద దేవీ మాత శోభాయాత్రలో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్
ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు.