ఖర్చు లేకుండా ఆరో గ్యం అందించాలనే లక్ష్యంతో యోగా కేంద్రాలు పెంచుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం 24 యోగా కేంద్రాలు నిర్వహిస్తున్నాం. యోగాతో అనేక వ్యాధులకు పరిష్కారం అభిస్తుంది. దీంతో పాటు ఆయుర్వేదం వాడితే ఎన్నో వ్యాధులు నయమవుతాయి. తుది శ్వాస వరకు యోగా, ఆయుర్వేదం ద్వారా సేవ చేసేందుకు నిర్ణయించుకున్నా. మైనారిటీ యోగా కేంద్రం నాకు అత్యంత ప్రత్యేకం. వీళ్లంతా నున్ను గురువుగా భావించి యోగా చేస్తున్నారు. దీంతో మరింతమంది నేర్చుకునేందుకు వస్తున్నారు.
– ఎక్కొండ ప్రభాకర్, శిక్షకులు,
యోగా రత్న అవార్డు గ్రహీత