
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
● ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి దిశానిర్దేశం
● రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్
అధికారులకు శిక్షణ తరగతులు
నిజామాబాద్‌అర్బన్: ఎన్నికల విధుల పట్ల పరిపూ ర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లచే అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు.
ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వర్తించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిట ర్నింగ్ అధికారులు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్‌వోలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరఫున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్ర త్తలు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఉపసంహరణకు అనుమతించా లని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని అన్నారు.. అభ్య ర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణా లు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు సరైన పద్ధతిలో సమర్పించేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నా రు. ఆర్‌వో, ఏఆర్‌వోల సందేహాలను నివత్తి చేసేందుకు వీలుగా జెడ్పీ సీఈవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేష న్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ సీఈవో సాయన్న, డీఈవో అశోక్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్ పాల్గొన్నారు.