
వసతి అధ్వానం
● జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడ బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో గదులు, మరుగుదొడ్లకు తలుపులు సక్రమంగా లేవు. దీంతో విద్యార్థులు ఇతర వస్తువులను అడ్డుపెట్టుకొని స్నానాలు చేస్తున్నారు. పాత రేకుల షెడ్డులో వంటగది కొనసాగుతోంది.
● గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న వసతి గృహం శిథిలావస్థకు చేరింది. పై పెచ్చులు ఊడుతున్నాయి. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.
● నగరంలోని దుబ్బా, ఆర్మూర్ ప్రాంతాల్లోని బీసీ బాలికల వసతిగృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు. వర్షం పడితే గదులు ఊరుస్తున్నాయి. బోధన్‌లోని ఎస్సీ వసతి గృహంలోనూ ఇదే పరిస్థితి.
నిజామాబాద్‌అర్బన్: సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏటా మరమ్మతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించి అభివృద్ధి చేసేది. నిధుల్లేక రెండేళ్లుగా సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు కరువయ్యాయి. దీంతో శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. గదుల తలుపులు, కిటికీలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, మరమ్మతుల నిధుల కోసం అధికారులు రెండుసార్లు నివేదికలు ప్రభుత్వానికి పంపినా అనుమతి మాత్రం రావడం లేదు.
నివేదికలు పంపి ఏడాది..
జిల్లాలోని ఎస్సీ 42, బీసీ 20, ఎస్టీ 8 సంక్షేమ వసతి గృహాల్లో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి 2024 మార్చి నెలలో అన్ని హాస్టళ్లను పరిశీలించిన అధికారులు రూ.8 కోట్లు అవసరం ఉంటాయని నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. ఏడాది గడుస్తున్నా ఆ నివేదికలకు మోక్షం లభించలేదు. ప్రస్తుత ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టళ్ల మరమ్మతులకు రూ.9కోట్ల70 లక్షలు అవసరమని మరోసారి నివేదిక పంపించారు. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు.
అనుమతులు ఆలస్యం..
జిల్లాలో 9 ఎస్సీ సంక్షేమ నూతన వసతిగృహాల నిర్మాణాలకు గతేడాది రూ.30 కోట్లు మంజూర య్యాయి. అయితే, నందిపేట మండలం ఐలాపూర్ వసతిగృహం అధ్వానస్థితిలో ఉందని, వెంటనే కొత్త భవనం నిర్మించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు రాగా, పనులు కొనసాగుతున్నాయి. మిగతా ఎనిమిది వసతిగృహాలకు కొత్త భవనాల నిర్మాణాని కి పరిపాలన అనుమతులు ఇంకా రాలేదు. ఇదే అంశంపై జిల్లా అధికారులు పలుమార్లు నివేదికలు పంపించినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు.
పలు హాస్టళ్ల పరిస్థితి ఇది..
జిల్లాలో వసతిగృహాల వివరాలు
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు
ఇబ్బందులు
రెండేళ్లుగా మంజూరు కాని నిధులు
నూతన భవనాలకు నిధులున్నా..
నిర్మాణానికి అనుమతి కరువు

వసతి అధ్వానం