
రైల్వేస్టేషన్‌కు హెగ్డేవార్ పేరు పెట్టాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ ప్రధాన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెగ్డేవార్ కేశవరావు బలిరామ్ పేరు పెట్టాలని ఆయన ముని మనుమడు హెగ్డేవార్ దిలీప్ శాస్త్రి ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హెగ్డేవార్ పరివారానికి ప్రత్యేకత ఉందన్నారు. హెగ్డేవార్ పేరుతో ఇప్పటికే కందకుర్తిలో స్మృతి మందిరం నిర్మాణం కోసం తన తండ్రి హెగ్డేవార్ శ్రీరామశాస్త్రి ఆర్‌ఎస్‌ఎస్‌కు స్థలం ఇచ్చారన్నారు. అందులో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్‌కు హెగ్డేవార్ పేరు పెట్టాలని ప్రభుత్వా లను దిలీప్ శాస్త్రి కోరారు.
గాంధీ, శాస్త్రీలకు నివాళి
నిజామాబాద్ అర్బన్: గాంధేయ మార్గం అందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం నగరంలోని గాంధీచౌక్‌లో మహా త్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధా ని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహాత్ముడు చూపిన బాటలో పయనిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. వేడుకలలో వివిధ శాఖ ల అధికారులు, పుర ప్రముఖులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో నెమలి మృతి
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్ర శివారులో జాతీయ రహదారి 44 పై గురువారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జాతీయ పక్షి నెమలి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు నెమలికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం దహన సంస్కారాలు చేశారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పంట భూముల్లో అధికంగా నెమళ్లు సంచరిస్తున్నాయి. దీంతో రోడ్డు దాటే క్రమంలో అవి ప్రమాదాల బారిన పడుతున్నాయి.
7న అవయవదానంపై అవగాహన సదస్సు
నిజామాబాద్ నాగారం: జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్ పెన్షనర్స్ భవన్‌లో ఈనెల 7న అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె.రామ్మోహన్‌రావు, ఈవీఎల్‌నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జన విజ్ఞాన వేది క, తెలంగాణ ఆల్ పెన్షనర్స్– రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి అవయవదాన ప్రచారకర్తలు హాజరుకానున్నారు.