
ఘనంగా విజయదశమి
● ఊరూరా పండుగ సందడి
● భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
● శమీ (జంబి) వృక్షానికి పూజలు
● అట్టహాసంగా రావణ దహనం
నిజామాబాద్ రూరల్: విజయదశమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో జంబి హనుమాన్, బ్రహ్మంగారి గుడి, వినాయక్‌నగర్‌లో ఏడుపాయల దుర్గమ్మ, దేవీరోడ్‌లోని దేవీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వాహన, ఆయుధ పూజలు చేసి సాయంత్రం శమీ (జంబి) వృక్షానికి పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు జంబి(బంగారం) ఇచ్చిపుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి గాయత్రినగర్‌లో రావణదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మైదానం జనసంద్రమైంది.

ఘనంగా విజయదశమి