
ఎస్సారెస్పీలోకి 800 టీఎంసీల వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ప్రస్తు త సంవత్సరం ఇప్పటి వరకు 800 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇంకా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి 33 వరద గేట్ల ద్వారా లక్షా 75 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వారం క్రితం ఇన్‌ఫ్లో తక్కువగా ఉన్నప్పటికీ గోదావరిలోకి భారీగా నీటిని వదిలిపెట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం భారీగా తగ్గింది. ప్రస్తుతం నీటిమట్టం పెంచడానికి అధికారులు ఔట్ ఫ్లోను తగ్గించారు. ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 616, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1089.70 (78.12 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అఽధికారులు పేర్కొన్నారు.
‘సాగర్’కు తగ్గని వరద
నిజాంసాగర్(జుక్కల్): పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి లక్షా 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం తెలిపారు. 10 గే ట్లను ఎత్తి 76,020 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రానికి 1402.25 అడుగుల (14.07 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు.