
ఆర్మూర్ కళాకారులకు అవార్డుల పంట
ఆర్మూర్: మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ, దసరా సంబురాల్లో ఆర్మూర్ పట్టణంలోని నటరాజ నృత్యనికేతన్‌లో శిక్షణ పొందిన చిన్నారులు కూచిపూడి, ఆంఽధ్ర నాట్యం ప్రదర్శనలతో అవార్డులను కై వసం చేసుకున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్‌అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఈ వేడుకల్లో నాట్య గురువు డాక్టర్ బాశెట్టి మృణాళినితోపాటు 20 మంది చిన్నారుల ప్రదర్శనకు మెచ్చిన నిర్వాహకులు ఫ్యూచర్ ఐకాన్ ఆఫ్ డ్యాన్స్ ఇంటర్నేషనల్ ఎక్సెలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు.
చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న మృణాళిని విశిష్ట అతిథిగా కార్యక్రమానికి ఆహ్వానించి అవార్డును అందజేసి సన్మానించారు. గురువుతోపాటు చిన్నారులు అవార్డులను కై వసం చేసుకోవడంపై నటరాజ నృత్యనికేతన్ వ్యవస్థాపకులు మాడవేడి నారాయణ, చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.