
పేరుకే డ్రగ్ స్టోర్.. మందులన్నీ బయటే..
● టీజీఎమ్‌ఎస్‌డీసీలో చిందరవందరగా మెడిసిన్స్ డబ్బాలు
● కలెక్టర్ పర్యవేక్షించినా మారని తీరు
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్–1లో ఉన్న టీజీఎమ్‌ఎస్‌డీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్) సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఆవరణలో మెడిసిన్ డబ్బాలను ఇష్టారాజ్యంగా పడేశారు. కొన్ని డబ్బాలు పగిలిపోయి గ్లూకోజ్‌లు, సిరంజీలు, ఇతర మెడిసిన్‌లు అన్ని బయట పడి ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 12న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను తనిఖీ చేశారు. మందులను భద్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయినా సెంట్రల్ డ్రగ్‌స్టోర్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడి అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో మందులు అన్ని ఇష్టారాజ్యాంగా పడేస్తున్నారు. ఇక్కడి నుంచి జిల్లాలోని జీజీహెచ్(ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి), బోధన్ జిల్లా ఆసుపత్రి, ఆర్మూర్‌ఏరియా ఆసుపత్రి ఇలా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు. కార్యాలయ ఆవరణలోనే మందులు సగం చెడిపోతే.. ఆస్పత్రులకు ఏ విధంగా సరఫరా చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పేరుకే డ్రగ్ స్టోర్.. మందులన్నీ బయటే..