స్వగ్రామానికి చేరిన మృతదేహం | - | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి చేరిన మృతదేహం

Sep 24 2025 7:51 AM | Updated on Sep 24 2025 7:51 AM

స్వగ్

స్వగ్రామానికి చేరిన మృతదేహం

స్వగ్రామానికి చేరిన మృతదేహం యువకుడి అదృశ్యం నలుగురిపై కేసు నమోదు బోరు మోటారు చోరీ

మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల బహ్రెయిన్‌ దేశంలో మృతిచెందగా, మంగళవారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. వివరాలు ఇలా.. మండలంలోని చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన కామటి ఎల్లయ్య(49) మూడు నెలల క్రితం బహ్రెయిన్‌ వెళ్లాడు. ఈ నెల 12న చాతిలో నొప్పంటూ కుప్పకూలిపోయాడు. వెంటనే ఎల్లయ్యను స్నేహితులు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడి బంధువులు, అక్కడి స్నేహితులు మృతదేహం స్వగ్రామానికి వచ్చేలా కృషి చేయడంతో మంగళవారం చేరింది. ఎల్లయ్య మృతదేహాన్ని చూసి గ్రామస్తులు, కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

నవీపేట: మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన నందిపేట కృష్ణ(33) అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 19న కూలీ పనులకు వెళ్లిన కృష్ణ ఇప్పటికీ ఇంకా ఇంటికి తిరిగిరాలేడు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు. మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఇటీవల ‘ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లవద్దని’ అక్కడ హెచ్చరిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన మహ్మాద్‌ సైఫుల్లాఖాన్‌, మహ్మాద్‌ సనాహుల్లాఖాన్‌, మహ్మాద్‌ అబ్దుల్‌ వదూద్‌ ఖురైషి, లులుఖాన్‌ అనే వ్యక్తులు సదరు ఫ్లెక్సీని తొలగించి కారులో ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. దీంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కానిస్టేబుల్‌ అన్వరీ వారిని హెచ్చరించారు. కానీ వారు వినిపించుకోకుండా కానిస్టేబుల్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. కారుతో కానిస్టేబుల్‌ను ఢీకొట్టేలా భయపెట్టారు. దీంతో నలుగురిపై కేసునమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లోని బోరుమోటారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బస్టాండ్‌ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆర్టీసీ ఆధికారులు మంగళవారం బస్టాండ్‌ను సందర్శించి బోరును పరిశీలించారు. వెంటనే డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్‌ తెలిపారు.

స్వగ్రామానికి చేరిన మృతదేహం
1
1/1

స్వగ్రామానికి చేరిన మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement