
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ధర్పల్లి: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇ చ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్ర భుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా మారినట్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీ ఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ నాయకులను ,కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఊ రుకునేది లేదని, అధికారంలోకి వచ్చాక అందరి లె క్కలు తేలుస్తామని ఆయన హెచ్చరించారు. కార్యకర్తలకు తాను ఎప్పుడు అండగా ఉంటాని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాజ్‌పాల్ రెడ్డి, రమాకాంత్, శ్రీనివాస్ నాయక్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
సిరికొండ : మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మైలారం తొలి సర్పంచ్, సిరికొండ సొసైటీ తొలి చైర్మన్ మద్దగారి రాజపండరి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ మృతదేహనికి బాజిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి, పాడె మోశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.