
అర్సపల్లిలో ఆయుర్వేద వైద్య శిబిరం
నిజామాబాద్ నాగారం: నగరంలోని ఆర్సపల్లి గ్రామంలో వివేకానంద యోగా కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మంగళవారం అడిషనల్ కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు.ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఔషధ మొక్కల ప్రాధాన్యత, వంట ఇంట్లో లభించే వస్తువుల ప్రాముఖ్యతను వివరించారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ రోజు రోజుకు ఆయుర్వేదం, యోగాకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. జిల్లా ఆయుష్ విభాగం ఇన్‌చార్జి గంగా దాస్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద శిబిరం, రక్త పరీక్షలు, షుగర్, బీపీ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈశిబిరంలో ఆయుర్వేద వైద్యులు ప్రేమలత, మమత, లలిత, జ్యోత్స్న వెంకటేష్, జయప్రకాష్ తిరుపతి, ఆయుష్ డీపీఎం వందన రెడ్డి ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు పురుషోత్తం, వరలక్ష్మీ, స్వరూప, జయరాజ, ఉమాప్రసాద్ మురళి, నీరజ, వివేకా నంద యోగా కేంద్రం అధ్యక్షుడు ఇంద్రకరణ్ రెడ్డి, యోగా ప్రభాకర్, కిషన్, సిర్ప హన్మాండ్లు, మాజీ ఎంపీటీసీ, యువ నాయకుడు ప్రీతం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.