నిధుల దారి మళ్లుతోంది | - | Sakshi
Sakshi News home page

నిధుల దారి మళ్లుతోంది

Sep 24 2025 7:39 AM | Updated on Sep 24 2025 7:39 AM

నిధుల

నిధుల దారి మళ్లుతోంది

న్యూస్‌రీల్‌

రైతులకు సరిపడా యూరియా

బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

– 8లో u

జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి , మంగళవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా కోటగిరిలో 36.4 మి.మీటర్లు , వర్నిలో 23.4, పొతంగల్‌లో 18.3 , చందూర్‌లో 22.8, భీమ్‌గల్‌లో 22.4, డిచ్‌పల్లిలో 15.0, నందిపేటలో 13.5, రెంజల్‌లో 18.6, మోపాల్‌లో 14.1 మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 11.0 మి.మీటర్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వేళ రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో రోడ్లు జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ పరిసరాల్లో వర్షపు నీరు నిలువడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

దసరాకు ఆర్టీసీ

ప్రత్యేక లక్కీ డ్రా

ఖలీల్‌వాడి: దసరా సందర్భంగా ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ప్రత్యేక లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రకటించిందని ఆర్‌ఎం జ్యోత్స్న మంగళవారం తెలిపారు. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 6వ తేదీ వరకు సెమీ డీలక్స్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, లహరి, నాన్‌–ఏసీ, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారు లక్కీ డ్రాకి అర్హులని తెలిపారు. ప్రయాణికులు తమ బస్‌ టికెట్ల వెనుక పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ వివరాలు రాసి ఆ టికెట్లను బస్సు స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్‌లలో వేయాలని సూచించారు. సేకరించిన అన్ని టికెట్లలో నుంచి అక్టోబర్‌ 8వ తేదీన రీజినల్‌ కార్యాలయంలో లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు. రీజియన్‌ నుంచి ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేస్తామని, నగదు బహుమతులు ఉంటాయన్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఇస్తామని వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి లక్కీడ్రాలో పాల్గొనాలని ఆమె కోరారు.

ఎంపిక చేసిన కేసులను ఇన్వెస్టిగేట్‌ చేయండి

ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లకు సీపీ సాయి చైతన్య ఆదేశాలు

వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా

దిశానిర్దేశం

ఖలీల్‌వాడి: ఎంపిక చేసిన కేసులను ఇన్వెస్టిగే ట్‌ చేయాలని ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లను సీపీ సాయిచైతన్య ఆదేశించారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కమిషనరేట్‌ నుంచి ఆయన మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లతో మాట్లాడారు. మిస్సింగ్‌, అసహజ మరణాల వంటి 89 కేసులను ఇన్వెస్టిగేట్‌ చేయాలన్నారు. ప్రజలకు సత్వర న్యాయం ఏ విధంగా అందుతుందో వివరించారు. హెచ్‌ సీలు, ఏఎస్సైలు నిర్దేశిత కేసులను ఇన్వెస్టిగేట్‌ చేస్తే, ఎస్సైలు, సీఐలకు ఇతర ముఖ్యమైన కేసుల ఇన్వెస్టిగేషన్‌కు సమయం దొరుకుతుందన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు డీసీపీ (అడ్మిన్‌) జి బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇ చ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని, దీంతో జిల్లాలో నిర్దేశిత పనులకు నిధులు అందక ఆగిపోతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నా రు. ఎంపీ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవా రం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) స మావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిఽ ద శాఖల్లో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అర్వింద్‌ మాట్లాడుతూ.. జాతీయ రహదారుల విషయంలో మొత్తం ఎనిమిది ప్యాకేజీలు ప్రతిపాదిస్తే, రాష్ట్ర ప్ర భుత్వం కోత విధించి రెండు మాత్రమే మంజూరు తీసుకుందన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏం చేస్తున్నారన్నారని ప్రశ్నించారు. మాధవనగర్‌, మామిడిపల్లి రైల్వే వంతెనలకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తనవద్దే పెట్టుకుందని, మామిడిపల్లి వంతెన పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3.5 కోట్లు ఇవ్వకపోవడంతో బీటీ రోడ్డు వేయడం లేదన్నారు. అర్సపల్లి వంతెన విషయంలో భూసేకరణ చేయడం లే దని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై దసరా తరువాత మూడు వంతెనల వద్ద ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఎంపీ పిలుపునిచ్చారు. డబ్బులు ఎలా ఇవ్వరో చూద్దామన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా? ఎన్నిసార్లు గుర్తు చేయాలంటూ అసహనం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌ జిల్లాకు రూ.20 కోట్లు కూడా నిధులు తెప్పించుకోలేని స్థితిలో ఉన్నారా అని అన్నారు.

● అమృత్‌ పథకం కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ.497 కోట్లు మంజూరైతే అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, నీటిసరఫరా పనులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు కేవలం 10 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారని, అమృత్‌పై దసరా తర్వాత ప్రత్యేకంగా సమీక్ష చేస్తానన్నారు. ఎంపీ లాడ్స్‌ నిధులతో జరిగే పనులకు కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించా రు. కేంద్రం నిధులతో జరిగిన పనులకు నేమ్‌ బో ర్డులు ఎందుకు పెట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు.

● నిజామాబాద్‌–ఆర్మూర్‌ మార్గంలో అటవీ భూమికి సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని, దీంతో రెండు ప్రదేశాల్లో రోడ్డు విస్తరణకు మార్గం సుగుమమైందని తెలిపారు.

● భారీ వర్షాల కారణంగా జిల్లాలో 40 వేల ఎకరాలకు పైగా పంటలు నష్టపోతే అధికారులు 17 వేల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. మరోసారి సర్వే చేసి బాధిత రైతులందరికీ నష్టపరిహారం అందేలా చూడాలని ఎంపీ అధికారులను కోరారు.

● నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల వారీగా రావాల్సిన పన్ను వివరాలను తెలుపాలన్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లో రోడ్ల పనుల విషయంలో సరైన సమాధానాలు చెప్పనందుకు డీఈ రాజేశ్వర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడీ లాంగ్వేజ్‌ మార్చుకోవాలని సూచించారు.

● నిజామాబాద్‌ నగరంలో పన్ను చెల్లించని వ్యాపారులతోపాటు భవనాలు చాలా ఉన్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నా రు. సుమారు రూ.20 కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. పులాంగ్‌ వాగు ముబారక్‌నగర్‌ వరకు చాలా చోట్ల ఆక్రమణలకు గురైందన్నారు. నాగారం వద్ద నిజాంసాగర్‌ కాలువ సైతం కబ్జా అయిందన్నారు. బోధన్‌ రోడ్డులోని రామర్తి చెరువు, బొందెం చెరువులు సైతం భారీగా ఆక్రమణలకు గురయ్యాయన్నారు. నగరపాలకంలో రెవెన్యూ విభాగం స్క్రీనింగ్‌ చేయాలన్నారు.

సమావేశంలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఎఫ్‌వో వికాస్‌ మీనా, ట్రైనీ కలెక్టర్‌ కరోలినా చింగ్తియాన్‌ మావి, నగరపాలక కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, డీఆర్డీవో సాయాగౌడ్‌, దిశ కమిటీ సభ్యులు హన్మంతరావు, ఆశన్న, లింగం, విజయ పాల్గొన్నారు.

బాల్కొండ: మహారాష్ట్ర ప్రాంతం నుంచి భారీ వరదలు వచ్చే అవకాశాలున్నాయనే సమాచారంతో శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్ట్‌ అధికారులు అప్రమత్తమయ్యా రు. గత మూడు రోజులుగా ఇన్‌ఫ్లో పెరుగుతూ త గ్గుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ నీటి మట్టా న్ని తగ్గిస్తూ పెంచుతూ వచ్చారు. కానీ ఇన్‌ఫ్లోతో సంబంధం లేకుండా మంగళవారం రోజున 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో ప్రాజెక్ట్‌ నీటి మట్టం 80.5 టీఎంసీల నుంచి సాయంత్రం వరకు 70 టీఎంసీల కు తగ్గిపోయింది. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 2.20 లక్షల క్యూసెక్కులు పెరిగింది. మహారాష్ట్ర నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్‌ అధికారులు సూచించారు.

కొనసాగుతున్న నీటి విడుదల

వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 40 గేట్ల ద్వారా 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని వి డుదల చేస్తున్నారు. అలాగే వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 2,500, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 400, అలీసాగర్‌ లిఫ్ట్‌ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్‌భగీరథ అవసరాలకు 231 క్యూ సెక్కులను వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరుపోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థా యి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగు లు కాగా మంగళవారం సాయంత్రం 1088.00 (70 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని..

రెంజల్‌(బోధన్‌): రెండు రోజులపాటు నిలకడగా ప్రవహించిన గోదావరి మంగళవారం మళ్లీ పోటెత్తింది. ఎగువన వర్షాలు కురుస్తుండడంతోపాటు మహారాష్ట్ర నుంచి భారీ వరద వస్తుండడంతో కందకుర్తి వద్ద అంతర్రాష్ట్ర వంతెనను ఆనుకుని ప్రవహిస్తోంది. కందకుర్తి పుష్కరక్షేత్రంలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది.

మోపాల్‌: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) మేకల గోవిందు అన్నారు. మండలంలో ని బాడ్సి సొసైటీ పరిధిలో ఎరువుల గోదామును డీఏవో మంగళవారం తనిఖీ చేశారు. యూరియా నిల్వ, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అవసరం మేరకు ఎరువులు ఉన్నాయని, ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. డీలర్లు ఎరువులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రయోజనాలను వివరించాలన్నారు. ఆయన వెంట బాడ్సి సొసైటీ చైర్మన్‌ నిమ్మల మోహన్‌రెడ్డి, సీఈవో నర్సయ్య, రైతు మహిపాల్‌రెడ్డి ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులను

రాష్ట్రం వాడుకుంటోంది

అభివృద్ధి పనులు నిలుస్తున్నా

అధికార పార్టీ ప్రజాప్రతినిధులు

పట్టించుకోవడం లేదు

దసరా తరువాత ఆర్వోబీల వద్ద

ఆందోళనలు చేస్తాం

దిశ కమిటీ సమావేశంలో

ఎంపీ ధర్మపురి అర్వింద్‌

ఎస్సారెస్పీలోకి భారీ ఇన్‌ఫ్లో వచ్చే

అవకాశం ఉందని సమాచారం

ప్రాజెక్టు నీటి మట్టాన్ని తగ్గిస్తున్న

అధికారులు

70 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ

నిధుల దారి మళ్లుతోంది1
1/4

నిధుల దారి మళ్లుతోంది

నిధుల దారి మళ్లుతోంది2
2/4

నిధుల దారి మళ్లుతోంది

నిధుల దారి మళ్లుతోంది3
3/4

నిధుల దారి మళ్లుతోంది

నిధుల దారి మళ్లుతోంది4
4/4

నిధుల దారి మళ్లుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement