
పనులను సత్వరం పూర్తి చేయాలి
● అధికారులకు కలెక్టర్
టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం
● అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల
పనుల ప్రగతిపై సమీక్ష
నిజామాబాద్ అర్బన్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఆయా పాఠశాలలకు మంజూరు చేసిన అదనపు తరగతి గదులు, వాటర్ సప్లయ్, టాయిలెట్స్ తదితర పనులు ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా గ్రౌండింగ్ కాని పనులు ఎన్ని తదితర వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల మెరుగు కోసం జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ. 42 కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేయగా, రూ.23 కోట్ల విలువైన పనులు జరిగాయని కలెక్టర్ తెలిపారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగంగా చేపట్టి పూర్తి చేసేలా చర్య లు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నందున పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో అవసరమైన చో ట యుద్ధ ప్రాతిపదికన టాయిలెట్స్, తాగునీరు, వి ద్యుత్ వసతి వంటి పనులను చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరు లభించిన పనుల వివరాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలపాలని ఎంఈవోలను ఆదేశించారు. కాగా, ప్రతి పాఠశాల లో విద్యార్థుల అపార్ ఐడీ తప్పనిసరి జనరేట్ చే యాలని కలెక్టర్ సూచించారు. ఓపెన్ టెనన్త్, ఇంటర్‌లో ప్రవేశాల కోసం అర్హులైన వారందరూ దరఖా స్తు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఈవో అశోక్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్, ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఎంఈవోలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.