
గుడ్డు పట్టుకొచ్చిన సభ్యురాలు
అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలకు తక్కువ బరువు, నాణ్యత లేనివి గుడ్లను సరఫరా చేస్తున్నారని దిశ కమిటీ సభ్యురాలు విజయ అన్నా రు. గుడ్డు తీసుకొచ్చి సమావేశంలో చూపించి ఫి ర్యాదు చేశారు. దీంతో ఎంపీ చిన్నసైజు గుడ్ల స రఫరాపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 నుంచి 60 గ్రాములు ఉండాల్సిన కోడి గుడ్డు 30 గ్రాములు మాత్రమే ఉండడం చూస్తుంటే అవినీ తి జరుగుతున్నట్లు అర్థమవుతోందన్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం విషయంలో కక్కుర్తి పడితే కేసీఆర్‌కు పట్టి న గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు. కోడిగుడ్ల సరఫరాపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కలెక్టర్‌కు ఎంపీ సూచించారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులను 1 నుంచి 8 తరగతుల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని, మిగతా తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో భోజన ఏజెన్సీలకు బకాయిలు ఉన్నాయన్నారు.