
కాసర్లకు కాళోజీ పురస్కారం
నిజామాబాద్ సిటీ: తెలుగు భాషోపాధ్యాయుడు, ప్రముఖ పుస్తక రచయిత, సిర్పూర్ జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు కాళోజీ జాతీయ పురస్కారం అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నరేశ్‌రావుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ అవార్డు అందజేశారు. జిల్లాకు చెందిన మరో కవి చందన్‌రావుకు డాక్టర్ సినారె అవార్డు అందుకున్నారు.
నిజామాబాద్‌నాగారం: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న అండర్–19 ఫుట్‌బాల్ (బాలుర) జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ కళాశాల స్థాయి బాలురు ఈ పోటీలలో పాల్గొనేందుకు 24న ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియానికి తరలిరావాలని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్టు ఈ నెల 25, 26, 27 తేదీల్లో జనగాంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటుందని తెలిపారు.
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు కొనసాగుతుంది. సోమవారం గరిష్టంగా 2 లక్షల 54 వేల క్యూసె క్కులు వచ్చిన వరద, క్రమంగా తగ్గు తూ సాయంత్రానికి లక్షా 80 వేల క్యూసెక్కులకు చే రింది. గోదావరిలోకి 39 వరద గేట్ల ద్వారా 2 లక్షల 54 వేల క్యూసెక్కుల నీటిని నిరంతరం వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా 15వేలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆ విరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీ ఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1090.6(78.8 టీఎంసీలు) అడుగుల నీటిమట్టం నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌ లాస్ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. ని జాంసాగర్ ప్రాజెక్టులోకి 60,630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు.