
వైరల్ హెపటైటీస్ ప్రమాదకరం
● ల్యాబ్‌లు, బ్లడ్ బ్యాంకులు రోగుల
వివరాలు ఇవ్వాలి : డీఎంహెచ్‌వో
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న వైరల్ హెపటైటీస్ అనే వ్యాధి ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ల్యాబ్‌లు, బ్లడ్‌బ్యాంకులు రోగుల వివరాలు నమో దు చేసి ఇవ్వాలని డీఎంహెచ్‌వో బద్దం రాజశ్రీ ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లు, బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులతో సోమవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెప టెటీస్ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. హెపటైటీస్‌లో ప్రధానంగా సిర్రోసిస్ ఆఫ్ లివర్, లివర్ క్యాన్సర్ యాంటీ ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులను తెలపాలని పేర్కొన్నారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ వైరల్ హెపటైటీస్‌ను 2030 సంవత్సరం వరకు నియంత్రించాలన్నారు. ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రుల మధ్య సమన్వయం ఉండా లన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రమేశ్, అంజన, సమత, టీహబ్ డాక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.