
ప్రజావాణికి 89 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తోపాటు నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వ భూమిని కాపాడండి
నందిపేట్ (ఆర్మూర్): నందిపేట మండలంలోని ఆంధ్రానగర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ సోమవారం ఆ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఎలవర్తి రమేశ్ అనే వ్యక్తి 12 సంవత్సరాల క్రితం కబ్జాకు పాల్పడ్డారని పే ర్కొన్నారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గల సామగ్రిని దొంగిలించిన వ్యక్తులపై విచారణ చేపట్టాలని కోరారు.