
భారీ ఆదా
మధ్యతరగతికి
ఆత్మనిర్భర్ భారత్ దిశగా..
జీఎస్టీ కొత్త శ్లాబుల అమలుతో వివిధ వర్గాల్లో సంతోషం
● హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపార, ఉద్యోగ, మహిళలు
సామాన్యుడు, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు ఈ జీఎస్టీ తగ్గింపు శ్లాబులు ఉపయోగపడతాయి. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులకు మరింత వైభవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఆత్మనిర్భర్‌తోనే వికసిత భారత్ సాధ్యం అవుతుంది. విద్యార్థులకు ఉపయోగపడే స్టేషనరీ లాంటి వస్తువులకు జీరో ట్యాక్స్, ఆరోగ్య బీమాకు పన్ను లేకుండా చేశారు. గ్రాసరీస్, కిరాణా, వ్యవసాయ పరికరాలు, ఔషధాలపై 5 శాతానికి పన్ను తగ్గించారు. చిన్న కార్లు, బైకులు, కంప్యూటర్లు, వివిధ రకాల గృహోపకరణాలపై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మరింత మేలు కలుగనుంది. – ధర్మపురి అర్వింద్,
జీఎస్టీ కొత్త శ్లాబుల అమలుతో వివిధ వస్తువుల ధరలు తగ్గనుండడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న 5, 12, 18, 28 శాతం శ్లాబుల స్థానంలో 5,18 శాతం శ్లాబులు మాత్రమే ఉండేలా కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు, రైతులు, గృహిణులు, విద్యార్థులు, యువత తమకు భారీగా ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్ల ధరలు భారీగా తగ్గనుండడంతో మధ్యతరగతి వారు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సిగరెట్లు, గుట్కా, పాన్‌మసాలాలపై 40 శాతం జీఎస్టీ విధించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వివిధ వర్గాల వారు ‘సాక్షి’ తో అభిప్రాయాలు పంచుకున్నారు. –సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
జీఎస్టీ తగ్గింపు ఊరటనిచ్చే అంశం
అనేక రకాల సామగ్రిపై జీఎస్టీ తగ్గించడం ఎంతో ఊరటనిచ్చే అంశం. జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు తగ్గడంతో పాటు కొనుగోళ్లు పెరగడానికి అవకాశం ఉంది. సామాన్యులకు ఆర్థిక భారం తగ్గుతుంది. విలాసవంతమైన సామగ్రిపై జీఎస్టీ భారం ఉన్నా మధ్య తరగతి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు.
– లక్ష్మీనారాయణ, లెక్చరర్, జూనియర్ కళాశాల మోర్తాడ్
నిత్యావసరాల
ధరలు తగ్గడం
సంతోషం
మెడికల్ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు మహిళలకు ఆర్థికభారం తగ్గించే మార్గం సంతోషంగా ఉంది. పేద, మధ్య తరగతుల ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో కుటుంబ నిర్వహణ సులభతరం అవుతుంది. మహిళలు అర్థికంగా అభివృద్ధి చెందుతారు.
– రాజమణి, ఆర్మూర్

భారీ ఆదా

భారీ ఆదా

భారీ ఆదా

భారీ ఆదా

భారీ ఆదా

భారీ ఆదా