
నేడు దిశ సమావేశం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా అభివృద్ధి సమ న్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు డీఆర్డీవో సా యాగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద యం 10.30గంటలకు ఎంపీ ధర్మపురి అర్వి ంద్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు.
సీసీ కెమెరాలు
నిరంతరం పని చేయాలి
నిజామాబాద్‌అర్బన్: ఈవీఎంలను భద్రపర్చిన గోదాము వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో హరిసింగ్, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఈవీఎం నోడల్ అధికారి ప్రసాద్ తదితరులతో కలిసి నిజామాబాద్ నగరంలోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము సీల్ ను తెరిచి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామగ్రి భద్రపర్చి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. వారి వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు ఉన్నారు.
బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి
ఖలీల్‌వాడి: నిజామాబాద్‌లోని బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కారించాలని డి పో–1 మేనేజర్ ఆనంద్, ఆర్టీసీ విజిలెన్స్ సీ ఐ మహిపాల్ ప్రభాకర్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యకు విన్నవించారు. సోమవారం సీపీని వారు మర్యాద పూర్వకంగా కలిశారు. నిజామాబాద్ బస్ స్టేషన్ పరిసరాల్లో ట్రా ఫిక్ సమస్యతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల గురించి సీపీకి వివరించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా టోర్నీలో సత్తా
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నీలో జిల్లా మహిళల, పురుషుల జ ట్లు సత్తాచాటాయి. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 20 నుంచి సోమవారం వరకు 11వ సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళల, పురుషుల టోర్నమెంట్ నిర్వహించగా.. జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానంలో, పురుషుల జట్టు తృతీయ స్థానంలో నిలిచి నట్లు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధా న కార్యదర్శి గాదారి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జట్ల విజయంపై అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు కేశ వేణు, గాదారి సంజీవరెడ్డితోపాటు ఉపాధ్యక్షులు దీపిక, ల్యాబ్ గంగారెడ్డి, బాగారెడ్డి, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
మళ్లీ భారీ వర్ష సూచన
నిజామాబాద్‌అర్బన్: జిల్లాకు మళ్లీ భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా అందులో నిజామాబాద్ జిల్లా సైతం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నంది పేట మండలంలో 24.0 మిల్లీ మీటర్లు, నవీపేటలో 15.2. డొంకేశ్వర్‌లో 8.3, సిరికొండలో 10.7, పొతంగల్‌లో 12.3, మోస్రాలో 7.5, సాలూరాలో 8.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తొమ్మిది మండలాల్లో సాధార ణం కన్నా ఎక్కువ వర్షం కురవగా, 23 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

నేడు దిశ సమావేశం

నేడు దిశ సమావేశం