
భూసేకరణను నెలాఖరులోగా పూర్తి చేయాలి
నిజామాబాద్‌అర్బన్: జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి సీఎం సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దసరాకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూములకు పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి, డీఎఫ్‌వో వికాస్‌మీనా, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, ప్రగ్యాన్ మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.