
తగ్గిన జీఎస్టీపై అవగాహన కల్పించాలి
● తగ్గిన ట్యాక్స్ వివరాలను
బోర్డులపై ప్రదర్శించాలి
● రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ
కమిషనర్ కె. హరిత
నిజామాబాద్‌నాగారం: జీఎస్టీ తగ్గిన వివరాలు అందరికీ అర్థమయ్యేలా వ్యాపారులు బోర్డులపై ప్రదర్శించాలని, అధికారులు మరింత అవగాహన కల్పి ంచాలని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రానికి సోమవారం వ చ్చిన కమిషనర్.. డివిజన్ పరిధిలో పన్నుల వివరా లు, ఆదాయ లక్ష్య సాధన, జీఎస్టీలో ఇటీవల జరిగిన మార్పులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్‌తో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రిటర్నులు సమయానికి, సక్రమంగా దాఖలు చే యాలన్నారు. వినియో గదారులకు ఆ ప్రయోజనాలు అందేలా చూ డాలన్నారు. బోధన్ చలాన్ స్కామ్‌కు సంబంధించిన పాత బకాయిలపై సమీక్షిస్తూ.. కచ్చితంగా చెల్లించాల్సిందేనని రైస్‌మిల్లర్స్‌ను ఆదేశించారు. తక్షణమే పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలన్నారు. చెల్లించని వారికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయన్నారు. చెక్కుల కేసులను సర్కిల్ వారీగా సమీక్షించిన కమిషనర్.. వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాయింట్ కమిషనర్ గోపాల్‌రావు, మేనేజర్ ఈశ్వర్, సీటీవోలు, ఏసీటీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.