
భక్తి మార్గంలో యువత
ఏకాగ్రత పెరుగుతుంది
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆది పరాశక్తిగా భావించే దుర్గామాతకు ఏటా భక్తులు పెరుగుతున్నారు. యువత ఎక్కువ సంఖ్యలో మాలను ధరించడం వారిలో భక్తిభావాన్ని పెంచుతోంది. సోమవారం నుంచి దేవీశరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఊరూరా దుర్గామాతను ప్రతిష్టించగా, యువకులు పెద్ద ఎత్తున మాలలు ధరించడం విశేషం. చిన్న పిల్లలు, మహిళలు సైతం దుర్గమ్మ సేవపై ఆసక్తితో మాలలు, కండువాలు ధరించారు.
దుర్గామాత మాల అంటే అత్యంత పవిత్రమైంది. దీనిని ధరిస్తే కఠిన నియమాలు పాటించాలి. హరిషడ్వర్గాలు (కామం, క్రోదం, మోహం, లోబం, మదం, మశ్చ్యరం) అదుపులో పెట్టుకోవాలి. నియమనిష్టలతో ఉపవాస పూజలు చేయడంతో ఇది సాధ్యం అవుతుందని పండితులు, పది పర్యాయాలు మాల ధరించిన పెద్దలు చెప్తున్నారు. పిల్లలు చిన్నప్పుడే మాల ధరించడంతో వారిలో భక్తి భావం పెరగడమే కాకుండా క్రమశిక్షణ అలవర్చుకోవడానికి అవకాశముంది. యువత చెడు అలవాట్లను దూరం చేసుకొని మంచి సన్మార్గంలో నడవడం, పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దుర్గాదేవిని మనసు పెట్టి కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం కలుగడంతో మాలను ధరించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది ప్రతీ ఊరిలో కనీం 50 మందికి తగ్గకుండా మాలలు ధరించారు.
మాలను ధరించి దుర్గామాత ను పూజిస్తే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. యువత ప్రాధాన్యతతో మాలలు వేయడం మంచి తరుణం. దీంతో దురలవాట్లు దూరం అవుతాయి. జపం చేయడంతో ఏకాగ్రత పెరుగుతుంది. శరీర చక్రాలన్నీ యాక్టివ్ అవుతాయి.
– గున్నాల నరేశ్, పండితులు, డొంకేశ్వర్
దుర్గామాతకు
ఏటా పెరుగుతున్న భక్తులు
మాలధారణతో క్రమశిక్షణ, భక్తిభావం
పిల్లలు, మహిళల్లో సైతం
దుర్గమ్మ సేవపై ఆసక్తి

భక్తి మార్గంలో యువత