
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
● మరొకరి పరిస్థితి విషమం
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై మహమ్మద్ షరీఫ్ తెలిపిన వివరాలు ప్రకారం.. ధర్మారం(బి)కి చెందిన సుశాంత్(22), మమ్ము అనే ఇద్దరు యువకులు కారులో ప్రధాన రోడ్డుపై అటుఇటుగా ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి కారులో ఇరుక్కున్న వారిని బయటికి తీశారు. కాగా, కారులో ఉన్న సుశాంత్(22) ఘటనా స్థలంలోనే మరణించాడు. తీవ్రంగా గాయపడిన మమ్మును 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వమ్ము పరిస్థితి విషయంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.