
తగ్గుతున్న ధరలు
మోర్తాడ్(బాల్కొండ): మొక్కజొన్న, సోయా సా గు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మా రింది. కోత దశకు చేరుకున్న పంటలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని ఆశించిన రైతుల కు నిరాశ మిగిలే పరిస్థితులే కనిపిస్తున్నాయి. పంట విక్రయించే సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కింద మక్కలకు క్వింటాలుకు రూ.2,700 ఉండగా, సోయాల ధర రూ.5,100 పలికింది. ప్రస్తుతం మక్కలకు రూ.2,200 – రూ.2,300, సోయాలకు రూ.4,700 ధర మాత్రమే లభిస్తోంది. వారం వ్య వధిలో రెండు రకాల పంటలకు క్వింటాలుకు రూ.400 వరకు ధర పడిపోవడంతో పెద్ద మొత్తంలో నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేనా?
సోయా ఎకరానికి 8 నుంచి 13 క్వింటాళ్లు, మొ క్కజొన్న విడిగా సాగు చేస్తే 18 నుంచి 28 క్వింటాళ్లు, పసుపులో అంతర పంటగా సాగు చేస్తే మాత్రం 12 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో సోయాకు క్వింటాలుకు రూ.5,328, మక్కలకు రూ.2,400 మద్దతు ధర లభిస్తుంది. కాగా, వర్షాకాలం పంటల కొనుగోలు కోసం ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో సోయా, మక్కలను వ్యాపారులకే విక్రయించాల్సి వస్తోంది. పాత పంటలకు ధరలు లభించినా, కొత్త పంటలకు ధరలు తగ్గిపోవడంతో తమకు నష్టమే అని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరుచుకుంటేనే మార్కెట్‌లో సోయా, మక్కలకు వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ధరలు తగ్గితే నష్టమే..
సోయా, మక్కలకు ధర ప డిపోతే రైతులకు నష్టమే. ప్రభుత్వం స్పందించి కొ నుగోలు కేంద్రాలను ఆ రంభించాలి. అలా చేస్తేనే వ్యాపారులు ధరలు పెంచుతారు. సోయా, మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.
– ఏనుగు రాజేశ్వర్, రైతు, మోర్తాడ్
మక్క, సోయా రైతుల పాట్లు
అమ్మకాలు మొదలయ్యే
సమయంలో పడిపోయిన రేట్లు
కొనుగోలు కేంద్రాల
ఏర్పాటుకు ఎదురు చూపులు

తగ్గుతున్న ధరలు

తగ్గుతున్న ధరలు