
హెపటైటిస్‌తో అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో హెపటైటిస్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వై ద్యాధికారి రాజశ్రీ తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో వైరల్ హెపటైటిస్‌పై జిల్లాస్థాయి సమన్వ య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 149 హెపటైటిస్–బి, 39 హెపటైటిస్–సి పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ట్రాన్స్‌జెండర్లు, డ్రగ్స్ వాడేవారు, సెక్స్ వర్కర్లు, ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది, టాటూ వేయించుకునేవారు, సెలూన్‌లో పనిచేసేవారు, డయాలసిస్ రోగులను హెపటైటిస్ హైరిస్క్ గ్రూపులుగా గుర్తించినట్లు తెలిపారు. బి, సి చికిత్స కేంద్రాలుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గుర్తించినట్లు తెలిపా రు. హెపటైటిస్–బి, సీ ర్యాపిడ్ టెస్టులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని, నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా పాజిటివ్ కేసుల లైన్ లిస్టును తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆఫీసర్ డాక్టర్ తుకారాం రాథోడ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రమోహన్, ఫార్మసీ సూపర్‌వైజర్ నారాయణ, డీపీఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.