
యాక్షన్ షురూ
న్యూస్‌రీల్
నిజామాబాద్
500 టీఎంసీల వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 500 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.
శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
– IIలో u
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్‌లోని రెవెన్యూ విభాగంలో ప్ర క్షాళన మొదలైంది. బల్దియాలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, రెవెన్యూ సమస్యలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ము న్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ దిద్దుబాటు చర్యలకు పూ నుకున్నారు. రెవెన్యూ విభాగం ఉన్నతాధికారి, డీసీ రవిబాబును రెవెన్యూ బాధ్యతల నుంచి తప్పించారు. అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి కాకుండా ఉన్నతస్థాయి అధికారి నుంచి రెవెన్యూ ప్రక్షాళన ప్రారంభించడం కొసమెరుపు.
తరచూ వివాదాల్లో రవిబాబు
డిప్యూటీ కమిషనర్ రవిబాబు తరచూ వివాదాల్లో నానుతుంటారు. రవిబాబు గతంలోనే బల్దియాలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మాజీ మేయర్ భర్తతో గొడవ పెట్టుకుని ఘర్షణ పడి వెళ్లిపోయాడు. గతంలో పని చేసిన నిర్మల్ మున్సిపాలిటీ, చింతమడక కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి. దూకుడు స్వభావం, నోటి దురుసు, అందరితో తగవులు పెట్టుకుంటారనే విమర్శలున్నాయి.
తక్కువ సమయంలోనే చెడ్డపేరు..
డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ గత మార్చిలో పదవీవిరమణ పొందగానే పోస్టు ఖాళీ అయింది. ఆ తర్వాత ఏఎంసీ జయకుమార్ బాధ్యతలు నిర్వహించారు. జూన్ 24న రవిబాబు డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై కార్పొరేషన్‌లో అడుగుపెట్టాడు. రాగానే రెవెన్యూ సిబ్బందితో మాట్లాడటం, ఉద్యో గుల అటెండెన్స్ పరీక్షించడం, తన బృందాన్ని సి ద్ధం చేసుకున్నారు. దీంతో కమిషనర్ దిలీప్‌కుమార్ ఈయనకు రెవెన్యూతోపాటు శానిటేషన్ బాధ్యతలను జూలై 18న అప్పగించారు. కాగా, విధుల్లో చేరి న వెంటనే పాత ఫైళ్లను బయటకు తీసి విచారణ ప్రారంభించారు. ఫైల్‌కు ఇంత అని రేటు ఫిక్స్ చేసి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో ఒత్తిడిపెంచారు. మ్యుటేష న్లు, ఇంటి నెంబర్లు, అసెస్‌మెంట్లు, రీఅసెస్‌మెంట్లు, పేరు మార్పులు వంటి పనులకు నేరుగా డ బ్బులు తీసుకోవడం ప్రారంభించారు. డబ్బులిచ్చి న వారి పనులు వేగంగా, నిరాకరించిన వారిని ము ప్పుతిప్పలు పెట్టడంతో వివాదాలు పెరిగాయి. దీంతో బల్దియా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తక్కువ స మయంలోనే డీసీ చెడ్డపేరు తెచ్చుకున్నారు. చివరికి ఆర్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ చేతికి చిక్కేవరకు వెళ్లింది.
రెవెన్యూ విభాగంలో అంతర్గత బదిలీలు
బల్దియాలో ఏసీబీ దాడులతో కమిషనర్ దిలీప్‌కుమార్ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్ ఖయ్యూమ్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో సీనియర్ అసిస్టెంట్ స్వప్నను నియమించారు. ఆర్‌ఐ శ్రీనివాస్ స్థానంలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న అనురాధకు బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేకాధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్షల్లో రెవెన్యూ ఫైళ్లలో అవకతవకలు, మ్యుటేషన్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం, ఆఫీసులోనే లంచం తీసుకోవడం, ట్రేడ్ లైసెన్సుల జారీలో అక్రమాలు వంటి పలు అంశాలు బయటపడ్డాయి. దీంతో డీసీ రవిబాబును రెవెన్యూ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్‌ను నియమించారు.
బల్దియా రెవెన్యూలో ప్రక్షాళన
పైస్థాయి నుంచి ప్రారంభించిన కమిషనర్
డీసీ రవిబాబుకు రెవెన్యూ విభాగం కట్
అడిషనల్ కమిషనర్ రవీంద్రసాగర్‌కు
కేటాయింపు
ఇక పాత ఫైళ్లకు మోక్షం

యాక్షన్ షురూ

యాక్షన్ షురూ

యాక్షన్ షురూ

యాక్షన్ షురూ