
త్వరలో తెయూలో వ్యవసాయ కళాశాల
● పీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ
మహేశ్‌కుమార్ గౌడ్
● ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా
‘గురుపూజోత్సవం’
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉందని, విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో శుక్రవారం బర్దీపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హా జరైన మహేశ్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. దేశనిర్మాణంలో ఉపాధ్యాయుల పా త్ర ఎంతో కీలకమన్నారు. గురుశిష్యుల అనుబంధం సక్రమంగా ఉంటే వారికి తిరుగే ఉండదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్య, వైద్యరంగాలకు అధిక ప్రా ధాన్యతనిస్తున్నారని, వచ్చే మూడేళ్లలో నిజామా బాద్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను చదువుకునే రోజు ల్లో ప్రతిదినం అటెండర్ రెండు మోపుల కర్రలతో వచ్చేవాడని, అప్పట్లో టీచర్లతో దెబ్బలు తినడంతోనే నేడు అనేకమంది ఉన్నతస్థాయిలో ఉన్నారని చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు చదువకుంటే ఉపాధ్యాయులు కొట్టడం కాదు కదా గట్టిగా మందలించే పరిస్థితులు లేవన్నారు. అయినా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తమ బాధ్యతను మరువొద్దని సూచించారు.
విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు వినయం, విధేయత, దేశభక్తిని నేర్పించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అర్బన్‌కు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేయాలని, అందుకు పీసీసీ అధ్యక్షుడు బాధ్యత తీసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి అవార్డులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, డీఈవో అశోక్ కుమార్, ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శేఖర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర కోశాధికారి జయసింహాగౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్, కోశాధికారి ఉప్పాల మధు, ప్రోగ్రాం కన్వీనర్ మోహన్, కో కన్వీనర్ టీఎం విక్రాంత్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకు సీఎం ఆమోదం
గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో దూరదృష్టి, విజన్ లేకపోవడంతో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పు ల్లో మునిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీలు చెల్లించడానికే సరిపోతుందన్నారు. అయినా ఇటీవల రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. తాను ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. త్వరలో తెయూలో వ్యవసాయ కళాశాల ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని, చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే నని పేర్కొన్నారు. ప్రైవే టు పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల జారీ విషయమై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రూరల్ నియోజకవర్గంలో ట్రస్మా భవన నిర్మాణానికి స్థలం కేటాయించేలా చూడా లని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.

త్వరలో తెయూలో వ్యవసాయ కళాశాల