
విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీయాలి
● అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్
నిజామాబాద్ సిటీ: విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాలను వెలికితీసి ప్రోత్సహించాలని, మెరిట్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఈవో అశోక్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని హెపీఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి ఎఫ్‌ఎల్‌ఎం, టీఎల్‌ఎం మేళా శుక్రవారం ని ర్వహించారు. మేళాకు అతిథులుగా హాజరై న అదనపు కలెక్టర్, డీఈవో మాట్లాడుతూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను ఉపయోగించి విద్యార్థులలో సబ్జెక్టుకు సంబంధించిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో నారాయణ గౌడ్, సేవాలా, సాయరెడ్డి, సందీప్, ప్రణయ్, శ్రీనివాసరావు, జె.శంకర్, సురేశ్, గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నగర శివారులోని ముబారక్‌నగర్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–2 ఏడీఈ ప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముబారక్‌నగర్, వీవీ నగర్, శ్రీనివాస్ నగర్, లక్ష్మీప్రియ నగర్, జనప్రియ నగర్, గ్రీన్‌పార్క్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కమ్మర్‌పల్లి: జూనియర్ కళాశాలల్లోని విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఫే షియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్‌లోనే హాజరు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అధ్యాపకులను ఆదేశించారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ, తరగతి గదులను పరిశీలించి అ ధ్యాపకుల బోధన తీరుపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యా ర్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని బోధనేతర సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఇన్‌చార్జి ప్రిన్సిపల్ జైపాల్‌రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.
‘పీఎం సూర్య ఘర్’ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సుభాష్‌నగర్: ‘పీఎం సూర్య ఘర్’ కార్యక్ర మాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి భారత ప్రభుత్వ లక్ష్యాన్ని 2030 వరకు చేరుకునేలా చూడాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్ సూచించారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల నార్త్ బ్లాక్ సెమినార్ హాల్‌లో శుక్రవారం నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిస్కం ఇంజినీర్లకు అంతర్గత సామర్థ్యంపై, పీఎం సూర్య ఘర్ బిజి లి యోజనపై రెండ్రోజుల శిక్షణ ప్రారంభించారు. ఎస్‌ఈ రవీందర్ సిబ్బందికి పలు అంశాలపై సూచనలు, సలహాలు చేశారు. వి శ్రాంత చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్ మాట్లా డుతూ.. గ్రీన్ పవర్ ఎనర్జీ మన గ్రిడ్‌కు అను సంధానం చేయాలని తెలిపారు. ఇంజినీర్లు సోలార్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి ఎక్కువమంది సోలార్ విద్యుత్ వాడే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ భారతి, శిక్షకులు విశ్రాంత ఎస్‌ఈ నరేంద్ర కుమార్, వెంకట సుబ్బయ్య, అల్జాపూర్ రమేశ్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీయాలి