
కొనసాగుతున్న కబడ్డీ శిక్షణా శిబిరం
నిజామాబాద్‌నాగారం: ముప్కాల్ మండల కేంద్రంలో జిల్లా కబడ్డీ జట్టు సభ్యులకు నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం కొనసాగుతోంది. అండర్–16 బాలబాలికలకు ఈ నెల 18 నుంచి 24 వరకు శిబిరం నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు అంధ్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి గంగాధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇట్టి శిక్షణలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25 నుంచి 28 వరకు జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఛైర్మన్ సాగర్‌రెడ్డి, కొమ్ముల నర్సయ్య, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ నునుగొండ అంజయ్య, పీడీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.