
స్కూల్‌తండాలో గంజాయి మొక్కలు సీజ్
రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని స్కూల్‌తండాలో గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై లావణ్య సిబ్బందితో కలిసి శుక్రవా రం దాడులు నిర్వహించారు. తండాకు చెందిన గంగావత్ రాజేందర్ తన ఇంటి పెరట్లో అక్రమంగా 25 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం గంజాయి మొక్కలను తొలగించి సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను సైతం సీజ్ చేశామన్నారు. నిందితుడు విచారణలో తాను వ్యక్తిగత వినియోగం, అమ్మకాల కోసం గంజాయి సాగు చేస్తున్నట్లు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.
న్యాయం చేయాలంటూ
పురుగుల మందు డబ్బాతో ఆందోళన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఓ మాజీ కౌన్సిలర్ ఇంటి ముందు శుక్రవారం బాధితుడు మహదేవ్ న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. బాధితుడు మాట్లాడుతూ.. పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలోని సర్వేనెంబర్ 769/186లో ఐదు ఎకరాల 10 గుంటల భూమిని మాజీ కౌన్సిలర్ భర్త వద్ద రూ. 70లక్షలకు కొనుగోలు చేయగా, సేల్ డీడీ చేసి ఇచ్చారన్నారు. కానీ తన పేరుపైన పాస్ పుస్తకం చేసి ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాలు అవుతుందని, అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

స్కూల్‌తండాలో గంజాయి మొక్కలు సీజ్