
ఎస్సారెస్పీలోకి 500 టీఎంసీల వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 500 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద గురువారం రాత్రికి తగ్గి, శుక్రవారం ఉదయం నుంచి పెరిగింది. గరిష్టంగా 3లక్షల 68 వేల క్యూసెక్కులకు పెరుగగా, సాయంత్రానికి 2లక్షల 16వేల క్యూసెక్కులకు తగ్గి, కొనసాగుతుంది.
ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ కోసం గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. ప్రాజెక్ట్ 12 వరద గేట్ల ద్వారా 35 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి పోతుంది. వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లోకి 1090.60(79.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.