
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
● నందిపేట్ పీహెచ్‌సీ తనిఖీ
నందిపేట్(ఆర్మూర్): సీజనల్ వ్యాధుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వ హిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజశ్రీ హెచ్చరించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరుతోపాటు ఓపీ రికార్డులను పరిశీలించా రు. రోగులకు అందుతున్న వైద్య సేవలను వైద్యాధి కారి ప్రవీణ్‌ను అడిగి తెలుసుకున్నారు. ‘స్వస్థ్ నారీ సశక్తి పరివార్’లో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. శిబిరంలో 113 మంది మహిళలు పలు పరీక్షలు జరిపినట్లు వైద్యాధికారి వివరించారు. వైద్య సిబ్బంది శ్రీకాంత్, గురురాజ్, స్వాతి, పీహెచ్‌ఎన్ పద్మావతి, భాస్కర్, హేమలత తదితరులు పాల్గొన్నారు.
మాలపల్లి వైద్య శిబిరం పరిశీలన
నిజామాబాద్ నాగారం: నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో కొన్నసాగుతున్న వైద్యశిబిరాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ శుక్రవారం పరిశీలించారు. వెద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజన, శ్యామల, షాదుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.