
నల్లబెల్లం, పటిక పట్టివేత
ఖలీల్‌వాడి: గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను పట్టుకున్నట్లు ఆర్‌పీఎఫ్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. ఆపరేషన్ సత్కార్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 2వేల కిలోల నల్లబెల్లం, 200 కిలోల పటికను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నల్ల బెల్లం విలువ రూ. 8లక్షలు, 200కిలోల పట్టిక రూ. 40 వేలు ఉంటుందన్నారు. పట్టుకున్న నల్ల బెల్లం, పటికను నిజామాబాద్ ఎకై ్సజ్ అధికారులకు అప్పగించామన్నారు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి, ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు.