
భారత న్యాయ విద్యకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
● అంతర్జాతీయ న్యాయవాది
డాక్టర్ శ్రీనివాస రావు
● తెయూ న్యాయశాస్త్ర విభాగంలో
అంతర్జాతీయ సదస్సు
తెయూ(డిచ్‌పల్లి): భారతీయ న్యాయవాదులు, న్యా య విద్యకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు ఉందని అంతర్జాతీయ న్యాయవాది, అమెరికాకు చెందిన డాక్టర్ కావేటి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో న్యాయ కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా ఆధ్వర్యంలో శుక్రవారం ‘వలస చట్టాలు – వ్యక్తిగత అంతర్జాతీయ చట్టాలపై అవగాహన’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. ఇతర దేశాలకు వలసలు వెళ్లేవారు ఆయా దేశాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే వీసాలు సులభంగా పొందవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూల్ ఆఫ్ లా అమలు జరగడం లేదన్నారు. అంతర్జాతీయంగా భారతీయులకు న్యా య విభాగంలో గొప్ప గుర్తింపు ఉందన్నారు. వ్యక్తు ల మద్య అంతర్జాతీయంగా వివాదాలు ఏర్పడితే ఏ ఏ న్యాయస్థానాల్లో కేసులు వేయవచ్చు అనే విషయాలపై అవగాహన కల్పించారు. కెనడా పౌరసత్వం కలిగిన బోధన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్లోబల్ ఇఆర్టీ సొల్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఉత్తం మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్లేస్‌మెంట్ అవకాశాలు ఉన్నాయని, తెయూ విద్యార్థులు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉ న్నతమైన లక్ష్యాలతో మహోన్నతంగా ఎదగాలన్నా రు. ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, అధ్యాపకులు స్రవంతి, నాగజ్యోతి, తదితరులు ఉన్నారు.