
ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
● కాలనీల్లో గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి
● సీపీ సాయిచైతన్య
ఖలీల్‌వాడి: ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, ఊర్లకు వెళ్లి నట్లయితే, ముందుగా పోలీ సులకు సమాచారం అందించాలని సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు దసరా పండుగకు సెలవులకు ఊరికి వెళ్లే వారు నిబంధనలు పాటించాలని –ప్రజలు తమ కాలనీల్లో ఉదయం వేళ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, పాత ఇనుపసామాగ్రి వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలి.
● రాత్రివేళల్లో అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించాలి.
● ఇళ్లకు తాళాలు వేసి ప్రయాణాలకు వెళ్తే, ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలి.
● వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
● పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
● ఇంట్లో మహిళలు, వృద్ధులు ఉంటే ‘అపరిచి తులు‘ సమాచారం పేరుతో ఇంటికి వస్తే నమ్మకుండా ఉండాలి.
● విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి, నమ్మి వెళ్లకూడదు.
● ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంటిలో ఉంచకపోవడమే మంచిది. వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం ఉత్తమం
● కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి.
● పోలీస్ శాఖ వారికి అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలి.
● చుట్టుపక్కల వారి ఫోన్ నంబర్లను తెలుసుకొని, ఉంచుకోవాలి.
● బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యక, ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోవాలి.
● విద్యుత్, గ్యాస్ లైన్, ఫ్రిజ్ మొదలగు వాటిని సరిగ్గా ఆఫ్ చేయాలి.
● ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. లేదా డయల్ 100 ను సద్వినియోగం చేసుకోవాలి.