ఖలీల్‌వాడి: నగరంలోని గంజ్ మార్కెట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఈనెల 16న నగరంలోని గంజ్ మార్కెట్‌లోని కూరగాయల షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 55–60ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఒంటిపై బూడిద రంగు బనియన్, క్రీమ్ కలర్ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659714ను సంప్రదించాలన్నారు.
నగరంలో..
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గుర్తుపట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభించిందని ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఈ వయస్సు ఉన్న వారు ఎవరైనా తప్పిపోయినచో ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659837, 8712659714కు సమాచారం అందించాలన్నారు.
నవీపేట: మండలంలోని నాగేపూర్ శివారులో శుక్రవారం ఉదయం ప్లాస్టిక్ సంచిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 30–40 ఏళ్లలోపు ఉంటుందన్నారు. దుండగులు హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో మూట కట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం పూర్తిగా కూలిపోయి ఉందని, మృతదేహంపై నలుపు రంగు ప్యాంటు, ఎరుపు రంగు టీషర్టు ఉందన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.