
క్రీడాకారులు యూనివర్సిటీకి గుర్తింపు తేవాలి
తెయూ(డిచ్‌పల్లి): క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి తెలంగాణ యూనివర్సిటీకి గుర్తింపు తేవాలని వర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి సూచించారు. తెయూ అంతర కళాశాల కబడ్డీ జట్ల (పురుషుల విభాగం) ఎంపిక పోటీలను శుక్రవారం రిజిస్ట్రార్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ పరిధిలో క్రీడలు, క్రీడాకాారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు కర్ణాటక రాష్ట్రం బెలగావి రాణిచెన్నమ్మ యూనివర్సిటీలో అక్టోబర్ 4 నుంచి 7 వరకు జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. ఆ పోటీల్లో చక్కని ప్రతిభ కనబర్చి విజేతగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, పీఆర్‌వో పున్నయ్య, స్పోర్ట్స్ డైరక్టర్ బాలకిషన్, పీడీలు బాలమణి, అనిల్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఆర్ నేత, నరేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులు యూనివర్సిటీకి గుర్తింపు తేవాలి