
పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు
ఖలీల్‌వాడి: పెట్రోల్ బంక్‌లో వాహనదారులకు ఉచితంగా పలు రకాలైన సేవలను నిర్వాహకులు అందించాలి.
● పెట్రోల్, డీజిల్ నాణ్యతను తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షల కోసం ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి.
● ప్రథమ చికిత్స కిట్లు, సాధారణ మాత్రలు ఉండాలి.
● ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలి.
● మూత్రశాలలు, తాగునీరు సౌకర్యం కల్పించడంతోపాటు, వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపేందుకు యంత్రాలు ఉండాలి.
● యజమాని, సంస్థ పేరు, ఏదైనా అవసరమైతే ఎవరిని సంప్రదించాలి, వారి ఫోన్ నెంబర్లు కనిపించేలా బోర్డు ఉంచాలి.
● బంకు తెరవడం, మూసివేసే సమాచారం ప్రదర్శించాలి.
● బంకులో రోజుకు 10 వేల లీటర్ల ఇంధనం అమ్మితే, దాని ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.600 సౌకర్యాల కల్పనకు కేటాయించాల్సిన నిబంధన ఉంది.
● బంకులో సౌకర్యాలు లేకపోతే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ( CPGRAMS) పోర్టల్ ఫిర్యాదు చేయవచ్చు.
● చమురు సంస్థల సేల్స్ మేనేజర్, లేదా స్థానిక తహసీల్దారుకు కూడా ఫిర్యాదు చేయొచ్చు.
సమాచారం..