
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
● 12(టీ) బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్
● నగరంలోని గిరిరాజ్ కళాశాలలో
‘హైదరాబాద్ లిబరేషన్ డే’ ఫొటో ఎగ్జిబిషన్
నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టీ) బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ అన్నా రు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆవరణలో మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రియాజిత్ సూర్ హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లిబరేషన్‌లో పోరాడిన నాయకులు చారిత్రక అంశాలను ఫొటో ఎగ్జిబిషన్‌లో పొందుపరిచారన్నారు. అనంత రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్ మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్‌లో నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబా ద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన రామ్ జి గోండు, కుమురం భీమ్, చాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, తదితరుల ప్రముఖుల ఫొటోలను ఏర్పా టు చేశామన్నారు. బైరాన్‌పల్లి ఘటన, ఆపరేషన్ పో లో వంటి ప్రధాన ఘట్టాలను వివరించే ఫొటోలు కూడా ప్రదర్శనకు ఉంచామన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈనెల 18 వరకు కొ నసాగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు ని ర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రి న్సిపాల్ రామ్‌మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి, ఎన్‌వైకే కోఆర్డినేటర్ శైలీ బెల్లాల్, ఆల్ ఇండియా రేడియో ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ మోహన్‌దాస్ పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం