
ఎస్‌ఐఆర్ పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నిజామాబాద్ నాగారం: ఓటరు జాబితాలో భాగంగా చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్‌లతో ఎస్‌ఐఆర్ అమలు ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలు అందిన మీదట ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీడబ్ల్యూవో రసూల్‌బీ, డీఎంహెచ్‌వో రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.