
అప్పులబాధతో ఒకరి ఆత్మహత్య
ఖలీల్‌వాడి: నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన మానేయకుర్ రమేశ్(44) అప్పులబాధతో ఆదివారం గడ్డి మందు తాగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గమనించిన కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడన్నారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి క్రైం: తండ్రిని చంపిన కేసులో ఓ కుమారుడికి కామారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్ మండలానికి చెందిన జాన్కంపల్లి విఠల్ 2021 మార్చి 16న హత్యకు గురయ్యాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా చిన్న కుమారుడు సంగమేశ్వర్‌తో తరుచూ గొడవలు జరిగేవి. సంగమేశ్వర్ తన తండ్రిని హత్య చేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ అనుమానించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో హత్యగా తేలింది. దీంతో సంగమేశ్వర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి సీహెచ్‌వీఆర్‌ఆర్ వరప్రసాద్ నిందితునికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్‌గౌడ్, కేసును సరైన పద్ధతిలో విచారణ జరిపిన సీఐలు రాజశేఖర్, రాజారెడ్డి, ఎస్సై రాజయ్య, భార్గవ్ గౌడ్, కోర్టు లైజనింగ్ అధికారి రామేశ్వర్‌రెడ్డి, సిబ్బంది సాయిలును ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.