
యూరియా.. లేదయ!
● వేధిస్తున్న కొరత
● ఇబ్బందిపడుతున్న రైతులు
● బస్తా కోసం గంటల తరబడి బారులు
● అయినా దక్కక నిరాశ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో సాగు చే సిన పంటలకు అవసరమైన మేర యూరియా సర ఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రైతులు ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రి వేళలోనే సొసైటీకి చేరుకుని అక్కడే ఉండి పొద్దున్నే వరుసలో నిల్చుంటున్నారు. మరికొన్ని చోట్ల చెప్పులు, రాళ్లు, చెట్లకొమ్మలు, పాసుపుస్తకాల జిరాక్సులను వరుస లో పెడుతున్నారు. జిల్లాలోని మాచారెడ్డి, రామారె డ్డి, బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి తదితర మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఆయా మండలాల్లో యూరియా కోసం రైతులు పది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో చెరువు లు, ప్రాజెక్టు లు నిండాయి. వర్షాలతో కొంత న ష్టం జరిగినా, ఉన్న పంటలకు ఎరువులు వేయాలని రైతులు సహ కార సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్టాక్‌కు మించి రైతులు వస్తుండడంతో ఒక్కో బస్తా చొప్పు నే పంపిణీ చేస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా చాలామందికి దక్కడం లేదు.
ఆందోళనకు దిగుతున్న రైతులు..
ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతు లు ఆందోళనకు దిగుతున్నారు. రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామంలో రైతులు సోమ వారం యూరియా కోసం ధర్నా చేశారు. అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచారె డ్డి మండల కేంద్రంలోనూ రైతులు రోడ్డెక్కారు.
పోలీసు పహారాలో పంపిణీ...
మాచారెడ్డి మండల కేంద్రంలోని సహకార సంఘానికి సోమవారం భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూపన్లు ఇవ్వడానికి అధికారులు పోలీ సుల సాయం తీసుకున్నారు. అక్కడ రైతులు, పోలీసులకు మధ్య పలుమార్లు వాగ్వాదం జ రిగింది. అలాగే వ్యవసాయశాఖ, సహకార శాఖ అధికారులతోనూ రైతులు గొడవకు దిగారు.
ప్రైవేటు వ్యాపారుల బ్లాక్ దందా....
కొందరు వ్యాపారులు ముందుగానే యూరియాను బ్లాక్ చేసి ఉంచారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎ క్కువ డబ్బులు తీసుకుని విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దళారులు పెద్ద మొత్తంలో ఎరువులు స్టాక్ చేసి ఉంచారన్న ప్రచారం జరుగుతోంది.
మాచారెడ్డిలో..
మాచారెడ్డి : మండలకేంద్రానికి సోమవారం యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో వేకువజామునే అన్ని గ్రామాల నుంచి సింగిల్‌విండోకు వచ్చి బారులు తీరారు. యూరియా రాకపోవడంతో విసిగి వేసారిన రైతులు ఇటుకలను క్యూలో ఉంచి ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని రోడ్డుపై రాస్తారోకో చేశారు.
జిల్లాలో 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవ సరం ఉండగా.. ఇప్పటికే 46 వేల మెట్రిక్ టన్నులు వచ్చింది. దానిని రైతులకు అందించాం. మంగళవా రం మరో 800 మెట్రిక్ టన్ను ల యూరియా రానుంది. ఆయా సొసైటీలకు సరఫరా చేసి రైతులకు పంపిణీ చేస్తాం. బ్లాక్ మార్కెట్ విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా బ్లాక్‌మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి