
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా
● జిల్లా నేతలకు కీలక పదవులు
● బీజేపీ పూర్తిస్థాయి కార్యవర్గం ప్రకటన
సుభాష్‌నగర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి సాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీనర్స య్య నియ మితులయ్యారు. బీజేపీ పూ ర్తిస్థాయి కార్యవర్గంతోపాటు ఏడు మోర్చాల రాష్ట్ర అధ్యక్షుల ను పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు సోమవా రం ప్రకటించారు. బస్వా లక్ష్మీనర్సయ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలోనే ఎంపీగా అర్వింద్ ధర్మపురి (2019లో) విజయం సాధించారు. మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జీగా 2024 ఎన్నికల్లో వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా రఘునంద న్‌రావు గెలుపొందా రు. ప్రస్తుతం వివిధ విభాగాలకు సంగారెడ్డి, నిర్మ ల్, పెద్దపల్లి జిల్లాల ఇన్‌చార్జీగా కొనసాగుతున్న ఆయన.. స్టేట్ యాక్టివ్ మెంబర్స్ కో కన్వీనర్‌గా కూడా ఉన్నారు. తనను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్‌కు బస్వాలక్ష్మీనర్సయ్య ప్రత్యేక ధన్యవాదా లు తెలిపారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా
గోపిడి స్రవంతిరెడ్డి
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి నియమితులయ్యారు. స్రవంతిరెడ్డి 2020 సంవత్సరంలో పార్టీలో చేరి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు. 2021లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ఎంపీ అర్వింద్ ధర్మపురికి స్రవంతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.